VZM: రేగిడి ఆమదాలవలస మండలం తునివాడలో సోమవారం మధ్యాహ్నం నాగావళి నదిలో చేపల వేటకు వెళ్లి అనంతరం స్నానానికి దిగిన లక్ష్మణరావు(55) గల్లంతయ్యిన నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం ఖండ్యాం నదిలో మృత దేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించారు.