MHBD: పెద్దవంగర మండలం చిట్యాల గ్రామానికి చెందిన పాక యాకయ్య- యాకమ్మ దంపతుల కుమార్తె స్వాతి(30)ఇంటర్ చదివి ఇంట్లోనే ఉంటుంది. ఈనెల 16న కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత స్వాతి కనిపించలేదు. దీంతో యువతి తండ్రి యాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు.