KRNL: పారిశుద్ధ్య విభాగంలో పనిచేసి మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐటీయూసీ (AITUC) నేతలు కర్నూలు కలెక్టర్ సిరిని కోరారు. ఈ సందర్భంగా నేతలు చంద్రశేఖర్, మునేప్ప సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన 13 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.