TG: బీహార్ CM నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అంతకుముందు కేబినెట్ సమావేశంలో ఆమోదించిన శాసనసభ రద్దు తీర్మానాన్ని కూడా గవర్నర్కు అందజేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు నితీష్ కుమార్ ఆపద్ధర్మ CMగా కొనసాగుతారు. ఈనెల 20న నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా మరోసారి CMగా ప్రమాణం చేస్తారు.