NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ 26 గంటల నిరాహార దీక్ష ప్రారంభమైంది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ దీక్షను చేపట్టారు. సన్న వడ్లకు ప్రకటించిన బోనస్ వెంటనే చెల్లించాలని, రైతులందరికీ ‘ఫసల్ బీమా’ పథకాన్ని వర్తింపజేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.