మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. RX-100, మంగళవారం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది.