TG: సౌదీలో జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వారి మృతదేహాలకు మత సాంప్రదాయం ప్రకారం సౌదీలోనే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించింది. బాధిత కుటుంబ సభ్యులలో ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరి చొప్పున అక్కడికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి అజారుద్దీన్‌తో కూడిన బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది.