కృష్ణా: ప్రభుత్వ ప్రోత్సాహంతో అధికార యంత్రాంగం మొంథా తుఫానులో సమర్థవంతంగా సేవలు అందించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డ(M) పులిగడ్డ ఇరిగేషన్ శాఖ అతిధి గృహంలో మొంథా తుఫాన్ పోరాట యోధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అధికారులు, సిబ్బందిని సత్కరించారు.