ఎన్టీఆర్: జి.కొండూరు మండలం గడ్డమడుగు ప్రాంతంలో లక్షల సంఖ్యలో ఆఫ్రికన్ నత్తలు చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంగ, టమాటా, దోసకాయ వంటి కూరగాయ పంటలు నత్తల దాడికి గురై పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి పరిశీలిస్తున్నా, నివారణ చర్యలు చేపట్టడం లేదని రైతులు అంటున్నారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు