కృష్ణా: జిల్లాలో క్లెయిమ్ చేసుకోని సొమ్ము బ్యాంకుల్లో నిలిచిపోయింది. ఈ సొమ్మును సరైన డిపాజిటర్లకు లేదా వారి చట్టపరమైన వారసులకు తిరిగి అందించే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం మీ డబ్బు-మీ హక్కు అనే విస్తృత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఖాతాదారులకు సంబంధించిన పోస్టర్లను మచిలీపట్నంలోని కలెక్టరేట్లో కలెక్టర్ బాలాజీ సోమవారం పోస్టర్ ఆవిష్కరించారు.