NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో ఇవాళ పోలీసులు పేకాట స్థావరంపై దాడుల్లో నిర్వహించారు. పది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 8,200 నగదును పోలీసులు సీజ్ చేశారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు పేర్కొన్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.