TG: అంగన్వాడిల్లో పిల్లలకు విజయ డైరీ పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలో ప్రారంభించనున్నారు. ఫలితాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. పౌష్టికాహార లోపం లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ పాలు పంపిణీ చేస్తోంది.