మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోగుల రవీందర్ రెడ్డిని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పరామర్శించారు. రవీందర్ రెడ్డి తండ్రి ముకుందరెడ్డి ఆదివారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలిసుకున్న కేసీఆర్ రవీందర్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.