RR: ఫ్లై ఓవర్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. శివరాంపల్లి వద్ద మన్మోహన్ సింగ్ ఫ్లై ఓవర్ పైనుంచి దూకి ఎండీ అజీమ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి మానసిక సమస్యలు ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.