TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించండం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో సోమవారం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ ప్రసాద్, వీఎస్వో రాధాకృష్ స్వాగతం పలికారు.