RR: షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని మేకగూడ రోడ్డుపై సీఐ ప్రసాద్, పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. సరైన పత్రాలు లేని వాహనాలను, అదేవిధంగా నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను రోడ్డుపై నడిపిస్తే సీజ్ చేస్తామని తెలిపారు.