WNP: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 15 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఫిర్యాదుల్లో భూ వివాదాలకు సంబంధించి 6, కుటుంబ తగాదాలు 1, గొడవలు 2, ఇతర 7 ఉన్నాయన్నారు.