NLR: వెంకటాచలం మండలంలోని గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమంలో సోమవారం కార్తీక వనభోజనాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.