KDP: సామాజిక సేవలో పెండ్లిమర్రి డిగ్రీ కళాశాల వాలంటీర్లు ఆదర్శంగా నిలవాలని యోగివేమన యూనివర్సిటీ NSS కోఆర్డినేటర్ డా.ఎన్ వెంకటరామిరెడ్డి అన్నారు. పెండ్లిమర్రి ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపు ముగింపును ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని విద్యార్థుల సేవా గుణాన్ని ప్రశంసించారు.