VZM: గృహాల కోసం దరఖాస్తులు చేసిన లబ్ధిదారులపై జరుగుతున్న సర్వేను నవంబర్ 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను సోమవారం ఆదేశించారు. ప్రభుత్వం గడువు నిర్ణయించినందున, అర్హత గల ప్రతి దరఖాస్తుదారుని వివరాలు సమగ్రంగా పరిశీలించి, ఎంపీడీవోలు యాప్లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు.