SRD: పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్ నిధి అని మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం కంగ్టి మండల తుర్కవడగాం గ్రామానికి చెందిన వినోద్‌కు ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.10,500 చెక్కును భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజప్ప ఉన్నారు.