NGKL: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్లోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులు పూర్తి చేయడంలో జాప్యం వద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.