AKP: ‘మీ డబ్బు-మీ హక్కు’ అనే నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలలపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ మెడిద జాహ్నవితో కలిసి ‘మీ డబ్బు-మీ హక్కు’ గోడ పత్రికను విడుదల చేశారు.