BDK: దేశంలో అసమానతలు లేని విద్యావిధానం కోసం విద్యార్థులు పోరాడాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా 23వ మహాసభ సందర్భంగా మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు నరేందర్ జెండాను ఆవిష్కరించారు.