పార్వతీపురంలోని తోటపల్లి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తికమాస ఆఖరి సోమవారం సందర్భంగా ఇవాళ శివ పార్వతుల కళ్యాణం కన్నుల పండుగ్గా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గిజబ వాస్తవ్యులు శ్రీ పెనుగంటి దామోదర రావు దంపతులు, మారాడాన అశోక్ కుమార్ దంపతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు.