ELR: జంగారెడ్డిగూడెంలో సోమవారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్, లైసెన్స్ లేకుంటే చర్యలు తప్పవని ఆర్టీవో ఎస్.ఎస్. రంగనాయకులు హెచ్చరించారు. వాహన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐలు రవి గోపాల్, సత్యనారాయణ పాల్గొన్నారు.