కృష్ణా: దాళ్వా సాగునీటి కోసం రైతు సంఘాల ఆధ్వర్యంలో పెడనలో రైతులు చేపట్టిన ధర్నాకు వైసీపీ నేత ఉప్పాల రాము సంఘీభావం సోమవారం తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్వహించిన ధర్నాలో రైతులతో కలిసి ఉప్పాల రాము పాల్గొన్నారు. రైతు సంక్షేమం కోసం వైసీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు.