TG: HYDలోని బోరబండలో హిజ్రాలు ఆందోళన చేపట్టారు. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఓ హిజ్రా తీరుకు నిరసనగా కొందరు హిజ్రాలు ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. తప్పుడు కేసులతో వేధిస్తోందని ఓ హిజ్రాపై ఇతర హిజ్రాల ఆరోపణలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారితో చర్చిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.