NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని ఇవాళ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ తెలంగాణ విశ్వ విద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరిని కలశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీని అందించి, అమలు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.