ప్రకాశం: సీఐఐ సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లాకు రూ.3,704 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 5 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.