SKLM: గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో ఇవాళ మంత్రి పర్యటించారు. ఈ మేరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.