NDL: బనగానపల్లె మండలం పసుపల గ్రామ సమీపంలో ఉన్న గుండం మల్లికార్జున స్వామి ఆలయంలో చివరి సోమవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన పలు పోటీలను ప్రారంభించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలస్తుందని తెలిపారు.