NRPT: నారాయణపేట మండలం జాజాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఫణిరాజ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థుల పేరెంట్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే ఉదయం 5 గంటలకే నిద్ర లేచి చదవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇతర పనులు చెప్పకుండా ప్రోత్సహించాలని కోరారు.