NLG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత చేపపిల్లల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో చింతపల్లిలోని పెద్ద చెరువులో సోమవారం రూ.94 వేల చేప పిల్లలను MLA విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, మత్స్య పరిశ్రమను అభివృద్దే లక్ష్యం అన్నారు.