KDP: ఈ నెల 19న పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్నిఅమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ పథకం రెండో విడతలో రాష్ట్ర వాటా రూ. 5,000 ,కేంద్రం వాటా రూ.2,000 కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ఆయన తెలిపారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ. 5,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు.