KRNL: ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని MRO రమాదేవి హెచ్చరించారు. తుంగభద్రలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఇవాళ పట్టుకుని, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ. 20,000 జరిమానా విధించారు. ఇకపై ఇలాంటి అక్రమ రవాణాపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.