ATP: బ్రహ్మసముద్రం ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఉమాదేవి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు ఈ తరగతులకు హాజరు కావాలని సూచించారు.