KDP: PGRSకు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అదనపు SP కె. ప్రకాష్ బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అదనపు SP పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఇవాళ ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే అధికారలను సమస్యలను పరిష్కరించే విధంగా ఆదేశించాడు.