WNP: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే వారికి ఆన్ జాబ్ ట్రైనింగ్ ముఖ్యమని వనపర్తి డీఐఈవో ఎర్ర అంజయ్య అన్నారు. జిల్లా వ్యాప్తంగా చదువుతున్న ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులు పట్టణంలోని పలు కేంద్రాలలో నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. ఈ కేంద్రాలను సోమవారం సందర్శించి, విద్యార్థుల హాజరు నైపుణ్యాలను పరిశీలించారు.