HYD: పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగశాలని ఆధునికీకరించి రియల్ టైమ్ పీసీఆర్, ఎలిజా, మైక్రో బయాలజికల్ పద్ధతులతో పరీక్షలు చేస్తున్నారు. వైరాలజీ ల్యాబ్లో కరోనా, హెపటైటిస్, డెంగ్యూ, ఇన్ఫ్లుయెన్జా వంటి వైరస్లపై పరిశోధనలు నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు.