KRNL: ఆదోని పట్టణంలోని ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్, నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో తరగతి గదుల కొరతను తీర్చాలని రాష్ట్ర విద్యాశాఖ సహాయ కమిషనర్ గోవింద నాయక్‌కు ఇవాళ CPM నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు అనుగుణంగా మరో రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు.