NRPT: నారాయణపేట పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా వద్ద సోమవారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక బొలెరో వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా వల్లాంపల్లి నుంచి జాజాపూర్‌కు ఇసుకను రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. డ్రైవర్ రమేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.