VZM: ఈ నెల 8, 9వ తేదీలలో ఒరిస్సాలోని బ్రహపురంలో జరిగిన నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీలలో బొబ్బిలి క్రీడాకారులకు పతకాల పంట కురిపించారు. ఈ పోటీలలో 10 బంగారు, 10 బ్రాంజ్, 5 సిల్వర్ పతకాలను కైవసం చేసుకుని ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా వీరిని స్దానిక ఎమ్మెల్యే బేబినాయన బొబ్బిలికోటలో సోమవారం అభినందించారు.