ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ. 3,17,314 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గిరిరాజు నర్సింహబాబు ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. టికెట్లు, లడ్డు ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, పంచామృత అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు.