KRNL: ఆదోనిలోని చేకూర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా లారీ వచ్చి ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.