CTR: గ్రామీణ స్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేసి, గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సూచించారు. శాంతిపురం మండలం చెంగుబల్ల పంచాయతీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అలాగే పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందని తెలిపారు.