సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమ ఆదాయానికి గండి కొడుతున్న వెబ్సైట్లపై చర్యలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకోవడంతో ఆ సైట్ క్లోజ్ అయ్యింది. దీంతో పాటు MovieRulz, Tamil Rockers వంటి ఇతర పైరసీ వెబ్సైట్లపైనా చర్యలు తీసుకోవాలని సినీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.