కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా పేరును జిల్లాకు పెట్టాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నామన్నారు.