BHPL: జిల్లా కేంద్రంలోని మంజూరునగర్లో నూతనంగా ఏర్పాటుచేసిన ఇండియా బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియా బ్యాంక్ జిల్లాలో ఈ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించనుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు ఉన్నారు.