BHPL: చిట్యాల మండలానికి చెందిన వృద్ధురాలు ఐలమ్మ ఇవాళ నిర్వహించిన ప్రజావాణిలో కన్నీళ్లతో కలెక్టర్‌ను వేడుకున్నారు. 10 ఏళ్ల క్రితం నడుం పడిపోయి, భర్త రెండు కాళ్లు కోల్పోయి ఇద్దరూ నడవలేని స్థితిలో ఉన్నామని, పింఛన్ ఇప్పించాలని కోరారు. ఆమె దయనీయ పరిస్థితికి కలెక్టర్ చలించి స్వయంగా దగ్గరకు వెళ్లి పింఛన్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చి, వీల్‌చైర్ అందించారు.